Header Banner

భక్తులకు బంపరాఫర్! ఇలా చేస్తే కుటుంబం మొత్తానికి వీఐపీ బ్రేక్ దర్శనం..!

  Thu May 15, 2025 09:44        Devotional

టీటీడీ మరో అరుదైన అవకాశం కల్పించింది. ప్రస్తుతం వేసవి సెలవుల్లోనూ తిరుమల లో రద్దీ సాధారణంగా ఉంది. రద్దీ కారణంగా జూలై 15 వరకు నిలుపుదల చేసిన వీఐపీ సిఫారసు లేఖలను .. ఇప్పుడు రద్దీ తగ్గటంతో తిరిగి పునరుద్దరించారు. నేటి నుంచి సిఫారసు లేఖలను టీటీడీ అనుమతిస్తోంది. రేపు (శుక్రవారం) నుంచి బ్రేక్ దర్శనాలు కేటాయించనున్నారు. కాగా, ఇదే సమయంలో టీటీడీ యువత కోసం మరో నిర్ణయం అమలు చేస్తోంది. టీటీడీ నిర్దేశించిన విధంగా చేస్తే.. కుటుంబం మొత్తానికి వీఐపీ బ్రేక్ దర్శనం కేటాయించనున్నారు.

లేఖల పునరుద్దరణ
తిరుమలలో వేసవి రద్దీ ఎక్కువగా ఉంటుందని టీటీడీ అంచనా వేసింది. ఫలితంగా జూలై 15 వరకు బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. సిఫారసు లేఖలను నిలుపుదల చేసింది. ప్రోటోకాల్ పరిధి లో ఉన్న వారికి మాత్రమే అవకాశం కల్పించింది. అయితే, టీటీడీ అంచనా వేసిన విధంగా వేసవి రద్దీ ఈ సారి కనిపించటం లేదు. దీంతో.. తాత్కాలికంగా తిరిగి సిఫారసు లేఖలను పునరుద్దరిస్తూ టీటీడీ నిర్ణయించింది. నేటి నుంచి తిరిగి సిఫారసు లేఖలను స్వీకరిస్తున్నారు. రేపటి నుంచి అవ కాశం మేర బ్రేక్ దర్శనాలు కల్పిస్తామని టీటీడీ వెల్లడించింది. ఇది తాత్కాలిక నిర్ణయంగా పేర్కొంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా నిర్ణయాలు ఉంటాయని టీటీడీ వెల్లడించింది.

రామకోటి రాసిన భక్తులకు
రామకోటి తరహాలో గోవింద కోటిని ఎవరైతే రాస్తారో వారికి, వారి కుటుంబసభ్యులకు వీఐపీ దర్శనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తోంది. ఈ కార్యక్రమాన్ని రెండేళ్ల క్రితమే ప్రవేశపెట్టినా, ఇప్పటివరకూ పెద్దగా ప్రచారంలో లేదు. 25 ఏళ్లు, లేదా అంతకంటే తక్కువ వయసున్న వారు ఈ గోవింద కోటి రాసేందుకు అర్హులు. వారు 10,01,115 సార్లు గోవింద కోటి రాస్తే వారితో పాటు కుటుంబ సభ్యులందరికీ వీఐపీ బ్రేక్​దర్శనం చేసుకోవచ్చు. ఈ పుస్తకాలు ఎక్కడపడితే అక్కడ దొరకవు. కేవలం టీటీడీ సమాచార కేంద్రాలు, పుస్తక విక్రయ కేంద్రాలు, ఆన్​లైన్​లోనే గోవింద కోటి నామాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తకం ఒక్కోటి 200 పేజీలు ఉంటాయి. ఇందులో 39,600 నామాలు రాసుకోవచ్చు.

కుటుంబం మొత్తానికి బ్రేక్
ఇలా 10,01,116 గోవిందకోటి నామాలు పూర్తి చేయడానికి దాదాపు 26 పుస్తకాలు అవసరం అవుతాయి. కోటి నామాల పుస్తకాలను రాయడానికి కనీసం మూడేళ్ల సమయం పడుతుందని టీటీడీ అంచనా వేసింది. ఈ గోవిందకోటి నామాలను రాయడం పూర్తి చేసిన వారు వాటిని తిరుమలలోని టీటీడీ పేష్కార్​కార్యాలయంలో అందిస్తే, వారికి మరుసటి రోజు వీఐపీ బ్రేక్​దర్శనం కల్పిస్తామని పేష్కార్​రామకృష్ణ తెలిపారు. యువతలో ఆధ్యాత్మికం పెంచడానికి, అలాగే సనాతన ధర్మంపై ఆసక్తిని కల్పించడానికి టీటీడీ కొత్త ఆలోచన చేసింది. మొదటిసారిగా గోవిందకోటి నామాల పుస్తకాన్ని కర్ణాటకకు చెందిన కీర్తన గతేడాది ఏప్రిల్​లో పూర్తి చేశారు. బెంగళూరులో ఇంటర్​పూర్తి చేసిన ఆమె 10,01,116 సార్లు గోవింద నామం రాసి టీటీడీకి సమర్పించారు. కీర్తన కుటుంబానికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు.


ఇది కూడా చదవండితల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్‌డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!

వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!

సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!

కడప మేయర్ కు భారీ షాక్‌! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!


చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!


బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andherapravasi #TirumalaDarshan #VIPDarshan #TTDUpdate #DevoteeOffer #TirupatiNews #SpiritualNews #FamilyDarshan